బన్నీ - త్రివిక్రమ్.! ఎంటర్టైన్మెంట్ సునామీ మాములుగా వుండదు.!
- June 12, 2023
ఏంటీ.! బన్నీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమానా.? ఆల్రెడీ ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ అంటూ మూడు సినిమాలు ఇదే కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయ్.
ఇప్పుడు తాజాగా ఈ ద్వయం మరోసారి కలవబోతోందా.? అంటే అవుననే అంటోంది ఆహా ఛానల్. అవునండీ, ఈ కాంబినేషన్‌ని అధికారికంగా ప్రకటిస్తూ ఆహా ఓటీటీ ఛానెల్ తాజాగా ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది.
అయితే, ఈ కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ వివరాలు మాత్రం తెలియచేయలేదు. అంతేకాదు, ఈ ఇద్దరూ కలిసి సెట్లో సందడి చేస్తున్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు ఆహా టీమ్.
అంటే, గురూజీతో కలిసి బన్నీ చేయబోయే ఆ ప్రాజెక్ట్ ఏమై వుంటుందబ్బా.! అని ఆరా మొదలెట్టేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే ఎంటర్టైన్మెంట్ సునామీ మామూలుగా వుండదు. అతి పెద్ద మూవీ పండక్కి సిద్దంగా వుండండి.. అని వెల్లడించింది.
అంటే ఇదేదో యాడ్ షూట్ కావచ్చు. లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్ కావచ్చు.. తప్ప సినిమా అయ్యుండొదు అని అనుకుంటున్నారు. ఇకపోతే, ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాతో బిజీగా వుంటూనే, ‘బ్రో’కి సంబంధించి తెర వెనక పనులు కూడా చూస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







