ఆరోగ్యానికి ఐదు సూత్రాలు.! ఈ సింపుల్ చిట్కాలు తెలుసుకోండి మరి.!
- June 12, 2023
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. కానీ, ఆ ఆరోగ్యానికి ఎన్నో రకాల అనర్ధాలిప్పుడు. అందుకు కారణం అనూహ్యంగా మారిపోయిన లైఫ్ స్టైల్, ఆహార విధానాలే.
అయితే, వున్నంతలో ఆరోగ్యాన్ని మెరుగ్గా వుంచుకునేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు ఇప్పుడు చూద్దాం. వీలైతే తప్పకుండా పాటించేద్దాం.
1. కరివేపాకును చాలా చీప్‌గా చూస్తుంటాం. కూరల్లో కనిపిస్తే తీసి పారేస్తుంటాం. కానీ, కరివేపాకు రోగ నిరోధక శక్తిని పెంచి, రక్థహీనతను తగ్గించడంలో చాలా తోడ్పడుతుంది.
2. సోంపు వాడకం చాలా మందికి తెలుసు. కానీ, తక్కువగా వాడుతుంటారు. సోంపు రెగ్యులర్‌గా వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటూ మలబద్ధకం సమస్య తీరుతుంది.
3. వేడి నీళ్లు దివ్యౌషధం. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా పరగడుపున ఓ గ్లాసుడు వేడి నీళ్లు తాగితే శరీరంలోని అనేక వ్యర్ధాలు తొలిగిపోయి మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది.
4. పుల్లని పండ్లు తీసుకుంటే సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అతి తక్కువ ఖర్చులో లభించే నిమ్మకాయను రోజూ కనీసం ఓ చెక్క (ఏ రూపంలో అయినా) క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
5.వెల్లుల్లిని ఆహారంలో ప్రతీ రోజూ భాగం చేసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా మారతాయ్.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







