'బహ్రైనౌనా' జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే వేదిక: పర్యాటక మంత్రి
- June 14, 2023
బహ్రెయిన్: జాతీయ ప్రణాళిక (బహ్రైనౌనా) పౌరసత్వ విలువలను బలోపేతం చేస్తుందని, మెజెస్టి కింగ్ నేతృత్వంలోని బహ్రెయిన్‌లో స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జాతీయ వేదికగా నిలుస్తుందని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA), జాతీయ ప్రణాళిక కార్యనిర్వాహక కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. హవార్ దీవుల ప్రమోషన్, బహ్రెయిన్ క్యాలెండర్, టూరిజం యాప్ ద్వారా బహ్రెయిన్ పర్యాటక కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. బహ్రెయిన్ సమాజంలోని ప్రామాణికమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వం, బహ్రెయిన్ జాతీయ గుర్తింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో.. జాతీయ గుర్తింపు విలువలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను అల్ సైరాఫీ ధృవీకరించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







