భారతీయ నటిపై కేసును కొట్టేసిన కోర్టు..!
- June 14, 2023
యూఏఈ: షార్జా ఎయిర్‌పోర్ట్‌లో మాదకద్రవ్యాల ఆరోపణ కేసులో నిర్బంధించబడిన భారతీయ నటి కేసును కోర్టు క్లియర్ చేసింది. ఈ మేరకు ఆమె న్యాయవాది, అల్ రెధా అండ్ కంపెనీలో లాయర్, లీగల్ కన్సల్టెంట్ మహ్మద్ అల్ రెధా తెలిపారు. జూన్ 12న ఆమెపై నమోదైన అన్ని అభియోగాలను కోర్టు కొట్టేసినట్లు పేర్కొన్నారు. రెధా కథనం ప్రకారం, ఆడిషన్ మరియు హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో పాత్ర కోసం 27 ఏళ్ల ఇద్దరు వ్యక్తులు ఆమెను 'మోసం' చేశారు. నటనా ప్రదర్శనలో పాల్గొనాలనే భావనతో ఆమె యూఏఈకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు నటిని మోసగించి షార్జాకు ట్రోఫీని తీసుకువెళ్లాలని కోరారు. అమెకు తెలియకుండా అందులో మత్తుపదార్థాలు దాచారు. ఏప్రిల్ 1న నటి ముంబై నుంచి షార్జా ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు, డ్రగ్స్ కలిగి ఉన్నందుకు అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నటిని 20 రోజులకు పైగా నిర్బంధించారు. ఆమె పాస్‌పోర్ట్ జప్తు చేశారు. తరువాత షరతులతో కూడిన బెయిల్‌పై నటి విడుదలైంది. ప్రస్తుతం ఎమిరేట్స్‌లో తన బంధువులతో నివసిస్తుంది. నటిపై విధించి ప్రయాణ నిషేధం ఎత్తివేశారని, త్వరలో ఆమె పేరు బ్లాక్ లిస్ట్ నుండి ఉపసంహరించబడుతుందని అల్ రెధా పేర్కొన్నారు. ఆమె పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వమని అభ్యర్థించామని, దాని కోసం ఎదురుచూస్తున్నట్టు అల్ రెధా చెప్పారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







