3-నెలల విజిటర్ వీసాను తిరిగి ప్రవేశపెట్టిన యూఏఈ
- June 14, 2023
యూఏఈ: యూఏఈ మూడు నెలల విజిట్ వీసాను తిరిగి ప్రవేశపెట్టింది. మూడు నెలల లేదా 90 రోజుల వీసా గత సంవత్సరం చివరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎక్కువ కాలం పాటు దేశాన్ని సందర్శించడానికి ఇష్టపడే సందర్శకుల కోసం దీర్ఘకాలిక 60 రోజుల వీసా ప్రవేశపెట్టింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. 90 రోజుల పాటు యూఏఈ ని సందర్శించడానికి ఇష్టపడే వ్యక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అయితే సర్వీస్ ప్రొవైడర్ ఆధారంగా అదనపు ధరతో దేశంలో వీసా పొడిగించవచ్చు.
ప్రస్తుతం రెండు రకాల ఎంట్రీ పర్మిట్లు ఉన్నాయి. టూరిస్ట్ వీసా లేదా లీజర్ వీసా, విజిట్ వీసా. పర్యాటక వీసా 30 లేదా 60 రోజులకు జారీ చేయబడుతుంది. విజిట్ వీసా 90 రోజుల పాటు జారీ చేయబడుతుందని రీగల్ టూర్స్ వరల్డ్‌వైడ్‌లో ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ కార్యకలాపాలకు సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురాత్వలప్పిల్ తెలిపారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
అధికారులు తిరిగి ప్రవేశపెట్టిన ఈ మూడు నెలల వీసా గురించి నివాసితులకు తెలియదని రూహ్ టూరిజం LLC సేల్స్ డైరెక్టర్ లిబిన్ వర్గీస్ తెలిపారు. ఈ వీసా కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దుబాయ్, అబుధాబిలకు ఇది చెల్లుబాటు అవుతుందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.
వీసా రుసుము
90-రోజుల-విజిట్ వీసా కోసం రుసుము మీ జారీ చేసే ప్రయాణ నిపుణుడిని బట్టి మారుతుంది. ప్రారంభ ధర Dh1,500, Dh2,000 వరకు ఉండవచ్చని వర్గీస్ చెప్పారు.
లాంగ్ టర్మ్ విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇటీవలి పాస్‌పోర్ట్-పరిమాణ రంగు ఫోటో, పాస్‌పోర్ట్ కాపీ సమర్పించాలి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..