హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభం
- June 15, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లో యూఏఈ కాన్సులేట్ జనరల్‌ను తెలంగాణ హోంశాఖ మంత్రి అహ్మద్ అలీ అల్ సయెగ్ ప్రారంభించారు. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వెల్లంవెల్లి మురళీధరన్‌తో పాటు పలువురు రాజకీయ అధికారులు, వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముంబై, కేరళ కాన్సులేట్ల తర్వాత భారత్ లో యూఏఈ మూడవ కాన్సులేట్ హైదరాబాద్‌లో ప్రారంభం కావడం యూఏఈ-భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబిస్తుందని హిస్ ఎక్సలెన్సీ అల్ సయెగ్ తెలిపారు. అనేక దశాబ్దాలుగా చారిత్రక మూలాలను కలిగి ఉన్న ఇండియాతో సంబంధాన్ని బలోపేతం చేయడానికి యూఏఈ నిబద్ధతను కాన్సులేట్ ప్రారంభం తెలియజేస్తోందన్నారు. రెండు దేశాలు లోతైన ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను కలిగి ఉన్నాయి. ఇది రెండు దేశాలలో స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి కాన్సులేట్ ప్రారంభంతో ఇవి మరింత ముందుకు పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి