ఇండియా G20 సమావేశాలకు ఒమన్

- June 15, 2023 , by Maagulf
ఇండియా G20 సమావేశాలకు ఒమన్

మస్కట్: 2023 సెప్టెంబర్ లో ఇండియా రాజధానిలో జరితే జి20 సమావేశాలలో పాల్గొంటున్నట్లు ఒమన్ ప్రకటించింది. ఈ మస్కట్‌లోని డిప్లమాటిక్ క్లబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలిపింది. G20 సమావేశాలు ప్రపంచ వృద్ధికి తోడ్పడే ఆర్థిక వ్యవస్థలతో అతిపెద్ద పారిశ్రామిక దేశాల కూటమి అని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ సలహాదారు, G20 సమావేశాల కోసం ఒమన్ సెక్రటేరియట్ అధిపతి పంకజ్ ఖిమ్జీ తెలిపారు. G20 సమావేశాలలో పాల్గొనడానికి ఒమన్‌కు భారతదేశం ప్రత్యేక ఆహ్వానం పంపిందని చెప్పారు.  అంతర్జాతీయ సంఘంతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు, ప్రాంతీయ స్థాయిలో చురుకైన భాగస్వామిగా ఒమన్ స్థానాన్ని కూడా ఈ ఆహ్వానం పటిష్టపరుస్తుందని ఖిమ్జీ స్పష్టం చేశారు. పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం, ఫైనాన్సింగ్ అందించడం ద్వారా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (SMEలు) మద్దతు ఇవ్వడం వంటి ప్రధాన సాధారణ సమస్యలను పరిష్కరించే G20 సమావేశాలలో ఒమన్ పాల్గొనడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందుతుందని ఆయన తెలిపారు.  G20 సమావేశాలలో ఒమన్ పాల్గొనడాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఖిమ్జీ పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com