ఉద్యోగుల నకిలీ వేలిముద్రలతో హాజరు.. ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- June 15, 2023
కువైట్: ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఉద్యోగుల వేలిముద్రలను ఫోర్జరీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ ప్రవాసులు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. పనికి హాజరుకాని ఉద్యోగుల తరపున వీరు వేలిముద్ర వేస్తారు. ఈ సెక్యూరిటీ గార్డులు తమ వేలిముద్ర వేయడానికి ఆ ఉద్యోగుల నుంచి నెలకు 10 దినార్లు వసూలు చేస్తారని నివేదిక చెబుతోంది. నిందితుల నుంచి ఉద్యోగులకు సంబంధించిన 40 సిలికాన్ వేలిముద్రలను అధికారులు గుర్తించారు. సిలికాన్ వేలిముద్రను స్వాధీనం చేసుకున్న ప్రతి ఉద్యోగిని కూడా విచారణ కోసం పిలుస్తున్నామని, అనుమానితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







