రెపో రేటుపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ కీలక నిర్ణయం

- June 16, 2023 , by Maagulf
రెపో రేటుపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ కీలక నిర్ణయం

మస్కట్: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని(5.00% - 5.25% మధ్య) అనుసరించి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) తన కీలక పాలసీ రేటును మార్చకుండా ఉంచాలని స్థానిక బ్యాంకులకు రెపో రేటును 5.75% వద్ద స్థిరీకరించాలని నిర్ణయించింది. రెపో రేటు అనేది వాణిజ్య బ్యాంకులు చివరి ప్రయత్నంగా సెంట్రల్ బ్యాంక్ నుండి స్వల్పకాలిక లిక్విడిటీని పొందేందుకు అనుమతించే పాలసీ రేటు. CBO ద్రవ్య విధాన లక్ష్యం దాని స్థిర మారకం రేటును కొనసాగించడం,  ఒమానీ రియాల్ స్థిరత్వం, మూలధన ప్రవాహాన్ని నియంత్రించడం, మార్పిడి రేటు హెచ్చుతగ్గులను తొలగించడం, పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచేందుక ఈ నిర్ణయం దోహదం చేస్తుందని సీబీఓ తన ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com