కచ్చా మ్యాంగో బిర్యానీ
- June 22, 2015
కావల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి మామిడి కాయ - ఒకటి
యాలకులు - 4
లవంగాలు - 4
దాల్చిన చెక్క - అర అంగుళం ముక్క
పచ్చిమిర్చి - రెండు
మిరియాలు - 6
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర పొడి - అరటీ స్పూను
అల్లం తురుము - టీ స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడా
తయారు చేసే విధానం
బాస్మతి బియ్యం కడిగి పావుగంట సేపు నాననివ్వాలి. తరువాత ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, మిరియాలు వేసి వేయించి తరువాత అల్లం తురుము, పచ్చి మామిడికాయ తురుము కూడా వేసి వేయించి సిమ్‌లో ఒక ఐదు నిముషాలు ఉంచి, పసుపు, జీలకర్ర పొడి, చల్లి మరో రెండు నిముషాలు వేయించి, కడిగి నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి సిమ్‌లోనే రెండు విజిల్ రానివ్వాలి. చల్లారాక మూత తీసి గరం మసాలా, కొత్తిమీర, జీడిపప్పు వేసి వేడివేడిగా చికెన్ లేదా మటన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే మామిడి కాయ్ బిర్యానీ రెడీ.
తాజా వార్తలు
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం







