ఎన్టీయార్‌తో ‘వార్’‌కి సిద్ధమంటోన్న ‘వసుమతి’.!

- June 17, 2023 , by Maagulf
ఎన్టీయార్‌తో ‘వార్’‌కి సిద్ధమంటోన్న ‘వసుమతి’.!

‘భరత్ అనే నేను’ సినిమాతో వసుమతీగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది. 

త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో రామ్ చరణ్ సరసన, టాలీవుడ్‌కి రాబోతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కి రాబోతున్న కియారా అద్వానీ.. బాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేసిందనీ తెలుస్తోంది.

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ‘వార్ 2’. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ మరో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

హృతిక్ హీరో కాగా, ఎన్టీయార్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. ఇదిలా వుంటే, ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కైరా అద్వానీనీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నారన్నది ఆ తాజా అప్డేట్.

అయితే, హృతిక్, ఎన్టీయార్‌తో పాటూ, కియారా పాత్రకీ ఈ సినిమాలో చాలా ఇంపార్టెన్స్ వుండబోతోందట. అయితే, హృతిక్, ఎన్టీయార్‌లలో కియారా ఎవరికి జంటగా కనిపించనుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com