రౌడీస్టార్ ఇమేజ్‌కి చెల్లు చీటీ పడేసినట్లేనా.?
- June 17, 2023
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. అదే సెన్సేషన్‌తో రౌడీ స్టార్‌గా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే, ‘లైగర్’ సినిమా రౌడీ ఇమేజ్‌ని ఫుల్‌గా డ్యామేజ్ చేసేసింది.
దాంతో, మనోడు ట్రాక్ మార్చేసినట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ ఇమేజ్‌ని ఫ్యామిలీ స్టార్ ఇమేజ్‌గా మార్చేసుకోవాలనుకుంటున్నాడట.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయ్. అందులో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెకక్కుతోన్న ‘ఖుషి’ ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
పరశురామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఇంకో సినిమా ఇప్పటికే సెట్ చేసి పెట్టేశాడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి సినిమాని వెరీ రీసెంట్‌గా పట్టాలెక్కించేశాడు కూడా.
ఇక, పరశురామ్ సినిమా కూడా పూజా కార్యక్రమాలు చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌కి సిద్దంగా వుంది. విజయ్‌కి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్. ఈ సారి కూడా అదే కాన్ఫిడెన్స్‌తో వున్నాడట. ఈ పరశురామ్, గౌతమ్ సినిమాల్లో హోమ్లీ అండ్ ఫ్యామిలీ స్టార్‌గా విజయ్ కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.
మిడిల్ క్లాస్ మెంటాల్టీ వున్న కుర్రోడిలా కనిపించబోతున్నాడట. సో, ఇకపై రౌడీ ఇమేజ్ ఫ్యామిలీ స్టార్ ఇమేజ్‌గా రూపాంతరం చెందబోతోందనీ అంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







