నిస్వార్థజీవి

- June 18, 2023 , by Maagulf
నిస్వార్థజీవి

తన రక్తాన్ని చెమట చుక్కలుగా 
ధారపోస్తు 
తను ముళ్ళ బాటలో 
నడచిన పిల్లలకి 
పూల బాటని అందిస్తు...

తన కష్టం పిల్లలకి 
తెలియనివ్వని వారి 
ఎదుగుదలే  తన విజయస్ఫూర్తిగా 
భావించి మురిసిపోయే 
నిస్వార్థయోధుడు ....

పైకి గంభీరంగా కనిపిస్తు 
ప్రేమను పంచటంలో 
అమ్మని మించిన ప్రేమతత్వము 
అహర్నిశలు శ్రమించే 
నిరంతర శ్రమజీవి ......

తప్పటడుగులు వేస్తే సరిదిద్ది 
భుజంతట్టి భరోసానిస్తు 
తన అవసరాలను పక్కకుపెట్టి 
పిల్లల ఆశలు ఆశయాలని తీర్చి 
ఏమి ఆశించని నిస్వార్థజీవి ....

తనలో తాను కుమిలిపోతు
తానొక్కడే రెక్కలు ముక్కలు 
చేసుకొని పిల్లలకి ఉజ్జ్వల భవిష్యత్తు
అందించి వారి విజయంలో సంబరం 
చూస్తు ఆనందించే *తొలి స్నేహితుడు*

కనిపించని ఆరాటంతో 
ఎదచెరువవవుతున్న ఎప్పుడు 
ఒంటరిగా మిగిలే కనిపించే దైవము 
ఏమిచ్చిన నీ ఋణం తీర్చుకోలేము. 
నీవు లేనినాడు నీ చిటికెన వేలు వీడిననాడు 
జీవనమే *శూన్యము నాన్న* .....

నాన్నలకి హృదయ పూర్వక 
అభినందనలు శుభాకాంక్షలు. 

--యామిని కోళ్ళూరు(అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com