ఇంకోస్సారి ఎపిక్ మూవీ ప్లాన్‌లో మెగాస్టార్.!
- June 19, 2023
సెకండ్ ఇన్నింగ్స్‌లో సెకండ్ మూవీగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్‌గా రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మరో ఎపిక్ మూవీలో నటించాలని చిరంజీవి అనుకుంటున్నారట. అయితే అది ఎలాంటి ఎపిక్ అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ, ఆ తరహా స్టోరీ కోసం ధర్శకులు కథలు సిద్ధం చేసే పనిలో వున్నారట.
ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా వున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయ్. ఈ లోగా మరో రెండు ప్రాజెక్టులు మెగాస్టార్ లైన్లో పెట్టారు. అలాగే, ఈ లిస్టులో ఓ రీమేక్ మూవీ కూడా వుందంటున్నారు. అదో మలయాళ రీమేక్ అనీ తెలుస్తోంది. ఎప్పటి నుంచో ‘బ్రోడాడీ’ రీమేక్‌లో చిరంజీవి నటిస్తారట అనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ ఆ రీమేక్‌పై క్లారిటీ రాలేదు.
తాజాగా ఆ సినిమా రైట్స్‌ని చిరంజీవి తనయ సుస్మిత కొనుగోలు చేయడంతో, త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







