‘సత్యభామ’గా చందమామ.! కాజల్ ఇరగదీసేసిందిగా.!
- June 19, 2023
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ జోరు పెంచింది. విభిన్నమైన కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటోంది. అందులో భాగంగానే ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘సత్యభామ’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ర్టీ అయ్యింది.
మొన్న కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో కాజల్ యాక్షన్ సీన్స్ చించి పడేసింది. అది కూడా చీరకట్టులో. పోలీసాఫీసర్ పాత్రలో కాజల్ నటిస్తోంది ఈ సినిమాలో. చీరకట్టులో పోలీస్ స్టేషన్‌కి వచ్చిన కాజల్ అగర్వాల్ సెల్లో వున్న నిందితుడ్ని ఉతికి ఆరేసి వాడి చేత రావల్సిన నిజం కక్కించింది.
అంతవరకూ మగ పోలీసులు చేయలేని పనిని కాజల్ అగర్వాల్ సింపుల్‌గా చేసి చూపించింది. ఈ క్రమంలో ఆమె చేతికున్న గాజులు పగిలిపోతాయ్. గాజులు తీసి కొట్టొచ్చుగా మేడమ్ అని పక్కనున్న వాళ్లు సలహా ఇస్తే, ఇంతవరకూ అవి లేకుండానే కొట్టారు కదా.. నిజం చెప్పాడా.? అని కౌంటర్ ఇచ్చింది కాజల్ అగర్వాల్.
డిఫరెంట్ లుక్స్‌లో ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది చందమామ ఈ సినిమాలో. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్కా స్క్కీన్‌ప్లే అందిస్తున్నారు. చూడాలి మరి, చందమామకి ‘సత్యభామ’ ఏ రేంజ్ పేరు తీసుకొస్తుందో.!
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







