యూఏఈ లో 6 రోజులపాటు ఈద్ అల్ అదా సెలవులు

- June 19, 2023 , by Maagulf
యూఏఈ లో 6 రోజులపాటు ఈద్ అల్ అదా సెలవులు

యూఏఈ: యూఏఈలో వేసవి సెలవులకు ముందే ఈద్ అల్ అధా సెలవులు రానున్నాయి. దీంతో నివాసితులకు సెలవులు ముందుగానే వచ్చినట్టయింది. యూఏఈలో 6 రోజులపాటు ఈద్ అల్ అదా సెలవులను ప్రకటించారు. ఇవి జూన్ 27( మంగళవారం) నుండి జూలై 2 (ఆదివారం ) వరకు సెలవులను ఇచ్చారు. ఈ సంవత్సరం వేసవి సెలవులకు ముందు ఈద్ సెలవులు రావడంతో నివాసితులు ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈద్ అల్ అధా సెలవులు తమ పిల్లల చదువుపై ప్రభావం చూపవని పలువురు విద్యార్థుల తల్లులు చెప్పారు.

ఫ్లైట్ కంపారిజన్ మార్కెట్‌ప్లేస్ స్కైస్కానర్ తాజా పరిశోధన ప్రకారం.. 87 శాతం మంది యూఏఈ ప్రయాణికులు ఈద్ సెలవుల సమయంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాలని  ప్లాన్ చేస్తున్నారు. సగానికి పైగా ప్రయాణికులు ఒక వారం లేదా అంతకంటే తక్కువ కాలం ట్రిప్పుల కోసం వెతుకుతున్నారు.42 శాతం మంది వారు తక్కువ విమాన సమయాలను ఇష్టపడతారట.  ట్రావెల్ ఎక్స్‌పర్ట్ ప్రకారం, 65 శాతం యూఏఈ ప్రయాణికులు విమాన ధరలు అందుబాటును బట్టి సెలవులను ప్లాన్ చేస్తున్నారు. కొత్త గమ్యస్థానాలను వెళ్లడం, షాపింగ్ చేయడం కోసం ఆసక్తి చూపుతున్నారు. టూర్ ఆపరేటర్ హాలిడే ఫ్యాక్టరీ Dh2,800 నుండి ప్రారంభమయ్యే డీల్ లను ప్రకటించింది.  ఈద్ అల్ అదా సెలవుల కోసం యూఏఈ నుండి అధికంగా యూకే,  ఫిలిప్పీన్స్,  భారతదేశం, థాయిలాండ్, ఇటలీ, టర్కీ, అమెరికా, ఇండోనేషియా, మాల్దీవులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని ట్రావెట్ ఏజెన్సీలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com