రీమేక్ సినిమాల్లో సుధీర్..
- May 13, 2016
మహేష్‌బాబుకి రీమేక్ సినిమాల్లో నటించడం అస్సలు నచ్చదు. ఒకరిని ఒక పాత్రలో చూశాక మళ్లీ ఆ పాత్రలో నన్ను నేను వూహించుకోలేను అంటుంటారు. ఆయన బావ సుధీర్‌బాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. రీమేక్ సినిమాలే ఆయనకి బాగా అచ్చొచ్చినట్టు అనిపిస్తుంటుంది. సుధీర్ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమే ఓ రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో విజయవంతమైన 'శివ మనసుల శక్తి' ఆధారంగానే సుధీర్ 'ఎస్.ఎమ్.ఎస్' రూపొందింది. ఆ మధ్య చేసిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' కూడా కన్నడ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. తాజాగా ఆయన మరో రీమేక్ కథపై మనసు పడ్డట్టు తెలిసింది. తమిళ చిత్రం 'ముందాసుపట్టి' చిత్రం రీమేక్‌లో సుధీర్ నటించనున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. కానీ ఈ విషయాన్ని సుధీర్ కానీ, ఆయన సన్నిహితులు కానీ ధృవీకరించలేదు. ఇటీవల 'బాఘీ'లో ప్రతినాయకుడిగా నటించిన సుధీర్ తదుపరి పుల్లెల గోపీచంద్ జీవితంపై హిందీ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఓ చిత్రంలో నటించబోతున్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







