యోగా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తున్నారా?

- June 21, 2023 , by Maagulf
యోగా చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తున్నారా?

జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు. సర్వ రోగ నివారిణిగా యోగాని అభివర్ణించొచ్చు.

గత కొన్నాళ్లుగా యోగాపై అవగాహన బాగా పెరిగిందనే చెప్పాలి. అయితే, ఇది చాలదు. ఇంకాస్త పెరగాలి అంటున్నారు యోగా నిపుణులు.

అయితే, యోగా చేసేటప్పుడు ముఖ్యంగా వాటర్ తాగొచ్చా.? అనే విషయంపై కొందరిలో చాలా డైలమాలున్నాయ్. ఆ డైలమా విషయంలో కొందరు యోగా నిపుణులు అందించిన సమాచారం ఈ విధంగా వుంది.

యోగా చేసే సమయంలో నీటిని తాగరాదన్న వాదన వుంది. ఆ వాదనలో ఎంతవరకూ నిజముంది.? 

యోగా చేసినప్పుడు శరీరం ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. అలాగే గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. అందుకోసమే, యోగా చేసిన వెంటనే నీటిని తాగరాదని చెబుతున్నారు. 

కొన్ని సెకన్ల తర్వాత నీటిని నిరభ్యంతరంగా తాగొచ్చు. కానీ, వేగంగా నీటిని తాగకుండా సిప్ సిప్‌గా తీసుకోవడం మంచిదని అంటున్నారు.

అయితే, చల్లని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నార్మల్ వాటర్ మాత్రమే తాగమని సూచిస్తున్నారు. కాదని చల్లని నీటిని తాగితే, అది హార్ట్ బీట్‌పై ప్రభావం చూపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com