ఒమన్‌లో అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్

- June 22, 2023 , by Maagulf
ఒమన్‌లో అంతర్జాతీయ స్మగ్లర్లు అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు 6 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ ట్యాబ్లెట్లతోపాటు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ పదార్ధాలను ఎదుర్కోవడం కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది. అందులోని అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేసింది. వారి వద్ద నుంచి 6 మిలియన్లకు పైగా క్యాప్టాగన్ టాబ్లెట్‌లను స్వాధీనం చేసుకుంది. స్మగ్లర్లపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com