గుజరాత్ లో 1.53 లక్షల మంది యోగా..
- June 22, 2023
గుజరాత్: అంతర్జాయతీయ యోగా దినోత్సవం జూన్ 21న సందర్భంగా గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన యోగా దినోత్సవం గిన్నిస్ రికార్డు సాధించింది. సూరత్ లోని డుమాస్ ప్రాంతంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ఈ యోగా కార్యక్రమంలో 1.53 లక్షల మంది యోగా చేశారు. వివిధ ఆసనాలు వేశారు. ఒకేచోట 1.53 లక్షల మంది యోగా చేయటంతో ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుసంపాదించింది.
దీంతో సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు అందజేశారు. సూరత్‌లో నిర్వహించే యోగా డే సెషన్లో 1.25 లక్షల మంది పాల్గొనేలా చూడాలని సూరత్ అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ ఊహించినదానికంటే ఎక్కువమందే వచ్చారని 1.50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.
ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంతోమంది యోగా చేసి ప్రాణాలు కాపాడుకున్నారని..యోగా,ప్రాణాయామం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. యోగాను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి మా ప్రభుత్వం త్వరలో 21 ‘యోగ్ స్టూడియో’లను ప్రారంభించనున్నామని సీఎం ప్రకటించారు. గుజరాత్ లో రాష్ట్ర యోగా బోర్డు ఇప్పటి వరకు 5 వేల మంది శిక్షకులకు శిక్షణ ఇచ్చిందని..రానున్న రోజుల్లో రాష్ట్రంలో 21 యోగా స్టూడియోలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.
ఈ రికార్డుపై హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి మాట్లాడుతూ..ఒకేచోట 1.50 లక్షల మందికి పైగా పాల్గొని యోగా చేయటంతో గిన్నిస్ రికార్డ్స్ నెలకొల్పిందని తెలిపారు. కాగా 2018లో రాజస్థాన్‌లోని కోటాలో జరిగిన యోగా డే సెషన్లో 1,00,984 మంది పాల్గొనడం అప్పట్లో రికార్డు సృష్టించింది. దాన్ని సూరత్ కార్యక్రమం బద్దలు కొట్టి సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







