సైనిక స్నాతకోత్సవానికి హాజరైన షేక్ హమ్దాన్

- June 23, 2023 , by Maagulf
సైనిక స్నాతకోత్సవానికి హాజరైన షేక్ హమ్దాన్

దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్,  దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జాతీయ సైనిక సేవ 18వ కోహోర్ట్ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారు. యూఏఈ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇంజనీర్ ఇస్సా అల్ మజ్రోయీ సమక్షంలో జరిగిన ఈ వేడుక అబుధాబిలోని సెయిహ్ హఫీర్‌లో విజయవంతంగా నిర్వహించారు. దేశాన్ని రక్షించడానికి, విజయాలను సంరక్షించడానికి శక్తివంతమైన సైనిక శక్తిని సిద్ధం చేయడం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ గ్రాడ్యుయేట్‌లను షేక్ హమ్దాన్ అభినందించారు. జాతీయ సైనిక సేవ సంసిద్ధతను సాధించడానికి పునాదులను అందజేస్తుందని, ఎమిరాటీ యువత తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుతుందని ఆయన అన్నారు. వారు ఈ దేశానికి సంరక్షకులుగా మారడంతో, ఈ గ్రాడ్యుయేట్లు దేశ నిరంతర అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ గ్రాడ్యుయేట్‌లు దేశానికి సేవ చేయడంలో ఉత్తమంగా ఉండాలని ఆకాంక్షించారు.వారి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు విధేయత, విలువలను కాపాడుకోవాలని వారిని కోరారు. అంతేకాకుండా, యూఏఈని భద్రతకు చిహ్నంగా మార్చడానికి కృషి చేయాలని కూడా కోరారు. ప్రెసిడెన్షియల్ కోర్ట్‌లోని స్పెషల్ అఫైర్స్ సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ కూడా హాజరైన గ్రాడ్యుయేషన్ వేడుకలో నేషనల్ సర్వీస్ రిక్రూట్‌ల ట్రైనింగ్ కోర్సుపై బ్రీఫింగ్ అందించారు. ఆ తర్వాత స్నిపర్ నైపుణ్యాల ఆకర్షణీయమైన ఫీల్డ్ ప్రదర్శన జరిగింది. ఈవెంట్ వ్యక్తిగత రక్షణ నైపుణ్యాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన వారి అధునాతన స్థాయి శిక్షణను, అసాధారణ పరిస్థితులను అత్యంత నైపుణ్యంతో నిర్వహించడానికి సంసిద్ధతను తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com