పిల్లలను కార్ల లోపల ఎప్పుడూ వదలకండి..!

- June 23, 2023 , by Maagulf
పిల్లలను కార్ల లోపల ఎప్పుడూ వదలకండి..!

యూఏఈ: వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో పిల్లలను కార్లలో వదిలేయడం చాలా ప్రమాదకరంగా మారిందని యూఏఈ వైద్యులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు ఇప్పుడు 40-డిగ్రీల మార్కును దాటుతున్నాయి.  పార్క్ చేసిన కారు లోపల ఇరుకైన స్థలం, ఎయిర్ కండిషనింగ్ సడెన్ గా పనిచేయడం ఆపివేస్తే అది వారి పాలిట విషాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో మిగిలిపోయిన పిల్లలు హీట్‌స్ట్రోక్‌కు గురవుతారు, మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందని మెడ్‌కేర్ పీడియాట్రిక్ స్పెషాలిటీ సెంటర్, మెడ్‌కేర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ కన్సల్టెంట్ డాక్టర్ వఫా ఫైసల్ హెచ్చరించారు.  ఈ మేరకు వారు కారులో ఓ ప్రయోగం నిర్వహించారు. కేవలం ఐదు నుండి ఆరు నిమిషాలు లాక్ అయిన కారులో ఏసీ పనిచేయకపోతే విపరీతంగా చెమటలు పడతాయి.  కొంత సమయం తర్వాత, తల తిరగడం, గందరగోళ స్థితిని కూడా అనుభవిస్తారని ప్రయోగం అనంతరం తెలిపారు. కేవలం 15 నిమిషాల్లోనే కారులోపల ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరుకుందన్నారు. తీవ్రమైన వేడి కారణంగా గుండె వేగంగా కొట్టుకొని,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని వివరించారు. 

2019 లో దుబాయ్‌లోని అల్ క్వోజ్ ప్రాంతంలో ఆరేళ్ల ఆసియా బాలుడు చాలా గంటలు బస్సులో చిక్కుకుపోయిన మరణించాడు. అదే సంవత్సరంలో అబుధాబిలో ఇద్దరు ఎమిరాటీ పిల్లలను వదిలివెళ్లిన వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 2017లో ఆరేళ్ల ఎమిరాటీ బాలిక ఆరు గంటల పాటు కారులో ఒంటరిగా ఉండిపోవడంతో మరణించిన ఘటన కూడా 2017లో నమోదైంది. అజ్మాన్‌లో ఇద్దరు  నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరీమణులు, వారి తండ్రి కారులో ప్రమాదవశాత్తూ లాక్ కావడంతో చనిపోయారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com