డైవింగ్ తర్వాత కొన్ని గంటల్లోనే టైటాన్ పేలింది: యూఎస్ నేవీ
- June 24, 2023
యూఏఈ: ఆదివారం టైటానిక్ షిప్‌బ్రెక్‌ను అన్వేషించడానికి బయలుదేరిన కొద్ది గంటలకే టైటాన్ పేలిపోయినట్లు భావిస్తున్నట్లు యుఎస్ నావికాదళం తెలిపింది. యూఎస్ నావికాదళం ధ్వని డేటాను విశ్లేషించింది. టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో పేలుడుకు అనుగుణంగా ఒక అసాధారణతను గుర్తించినట్టు యూఎస్ నేవీ సీనియర్ అధికారి మీడియాతో చెప్పారు. "ఖచ్చితమైనది కానప్పటికీ, కొనసాగుతున్న శోధన మరియు రెస్క్యూ మిషన్‌లో సహాయం చేయడానికి ఈ సమాచారం వెంటనే ఇన్సిడెంట్ కమాండర్‌తో షేర్ చేశాం" అని పేర్కొన్నారు. అట్లాంటిక్‌లో తప్పిపోయిన టైటానిక్ ఎక్స్‌డిషన్ సబ్‌మెరైన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు యుఎస్ కోస్ట్ గార్డ్ ధృవీకరించింది. టైటానిక్ ఎక్స్‌పెడిషన్ సబ్మెర్సిబుల్లో ఎక్కిన ఐదుగురు అన్వేషకులు ఇప్పుడు చనిపోయారని భావిస్తున్నట్లు టైటాన్ ఆపరేటర్ ఓషన్‌గేట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. "మా CEO స్టాక్టన్ రష్, షాజాదా దావూద్ మరియు అతని కుమారుడు సులేమాన్ దావూద్, హమీష్ హార్డింగ్ , పాల్-హెన్రీ నార్జియోలెట్ పాపం కోల్పోయారని మేము ఇప్పుడు విశ్వసిస్తున్నాము" అని ప్రకటన పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







