శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- June 24, 2023
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. టీటీడీ ప్రతీ నెలా నిర్దేశిత తేదీల్లో దర్శనం, ఆర్జితసేవలు, గదుల కోటాను ఆయా తేదీల్లో ఆన్లైన్లో ఓ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిరూ .300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేసింది. రేపు వసతి గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం తిరుమలలో దర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి... భక్తులకు పలు సూచనలు చేశారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు. చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







