హాలిడే ప్రయాణికుల కోసం ప్రత్యేక చర్యలు
- June 27, 2023
కువైట్: ఈద్ అల్-అదా సెలవులు, వేసవి సెలవుల సీజన్ ప్రారంభం కావడంతో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వేలాది మంది ప్రయాణీకులు ట్రావెల్ చేస్తున్నారు. విమానాశ్రయం ఆపరేటింగ్ అధికారుల సహకారంతో వందలాది విమానాలు, వేలాది మంది ప్రయాణికులకు వసతి కల్పించడానికి పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. లాంజ్‌లలో రద్దీని నివారించడానికి ప్రయాణికుల రాకపోకలను వీలైనంత వేగంగా పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. విమానశ్రయంలో పాస్‌పోర్ట్ కౌంటర్ల సంఖ్యను పెంచడం, కౌంటర్‌లలో సిబ్బంది స్థాయిలను పెంచడం, ప్రయాణికుల సామాను రవాణా చేయడానికి తగిన గ్రౌండ్ సర్వీస్ కంపెనీ లేబర్ ఉండేలా చూసుకోవడం లాంటి చర్యలు తీసుకుంటున్నట్లు DGCA తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







