సెలవుల్లో ఉచిత పార్కింగ్, టోల్ ఛార్జీలు లేవు

- June 27, 2023 , by Maagulf
సెలవుల్లో ఉచిత పార్కింగ్, టోల్ ఛార్జీలు లేవు

యూఏఈ: అబుధాబిలో మంగళవారం నుండి ప్రారంభమయ్యే ఈద్ అల్ అదా సెలవుల నాలుగు రోజులలో పార్కింగ్ ఫీజు,  టోల్ ఛార్జీలు ఉండవు. జూలై 1 ఉదయం 7:59 వరకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని అబుధాబిలోని మునిసిపాలిటీలు, రవాణా శాఖ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్(ITC) ప్రకటించింది.దీంతోపాటు ముసఫా M-18 ట్రక్ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ ఉచితమని తెలిపింది. డ్రైవర్లు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేయాలని, నివాస పార్కింగ్ ప్రదేశాలలో రాత్రి 9 నుండి ఉదయం 8 గంటల వరకు పార్కింగ్ చేయవద్దని ITC సూచించింది. అలాగే, మంగళవారం నుంచి దర్బ్ టోల్ గేట్ వ్యవస్థను ఉచితంగా అందించనున్నట్లు ఐటీసీ ప్రకటించింది. ఎమిరేట్‌లోని కస్టమర్‌ల హ్యాపీనెస్ సెంటర్‌లు సెలవు దినాల్లో మూసివేయబడతాయని తెలిపింది. ఇదిలా ఉండగా సెలవు రోజుల్లో డిమాండ్ మేరకు ప్రాంతీయ బస్సుల ట్రిప్పుల సంఖ్య పెరుగుదలతో పబ్లిక్ బస్సులు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని పేర్కొంది. ఇంటర్‌సిటీ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచడానికి ప్రైవేట్ రంగానికి చెందిన ఆపరేటర్‌లతో సమన్వయం చేసుకున్నట్లు తెలిపింది. అబుధాబి ఎక్స్‌ప్రెస్, అబుధాబి లింక్ బస్సు సర్వీసులు ఈద్ సెలవుల్లో ఉదయం 6 నుండి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. బస్సులు, ప్రజా రవాణా సేవలు, ITC సేవల సమయాలను వీక్షించడానికి, www.itc.gov.aeని సందర్శించాలి. లేదా టోల్-ఫ్రీ నంబర్ 800850లో లేదా దర్బీ స్మార్ట్ యాప్ ద్వారా మునిసిపాలిటీలు,  రవాణా శాఖ యొక్క సేవా మద్దతు కేంద్రాన్ని సంప్రదించాలి. అలాగే ‘TAMM’ ప్లాట్‌ఫారమ్ ద్వారా ITC సేవలను పొందవచ్చు. 24/7 సేవలను అభ్యర్థించడానికి కస్టమర్‌లు టాక్సీ కాల్ సెంటర్: 600535353ని కూడా సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com