ఈ పాఠశాలలో ఉచిత స్విమ్మింగ్ పాఠాలు..!
- June 29, 2023
దుబాయ్: దుబాయ్‌లోని ఒక స్విమ్మింగ్ స్కూల్ కొత్తవారికి ఈత కొట్టడం ఎలాగో నేర్పించే వినూత్న మార్గాన్ని పరిచయం చేసింది. బీచ్‌ని 15 నిమిషాల పాటు శుభ్రం చేయడంలో సహాయపడి.. స్విమ్మింగ్ ప్రాథమికాంశాలను తెలుసుకోవడానికి ఒక గంట ఉచిత సెషన్‌ను సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జుమేరాలోని ఆంఫిబియస్ స్విమ్ స్కూల్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిలిపినో ప్రవాస బింబో కాలిటిస్ మాట్లాడుతూ.. నీటిలో విలువైన జీవితకాల నైపుణ్యాన్ని పొందడంతోపాటు పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఈ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఈ రోజుల్లో ఎక్కువ మంది నివాసితులు, పర్యాటకులు బీచ్ లేదా పూల్‌కి వెళుతున్నారని తెలిపారు. సెషన్లు ప్రతి శనివారం మరియు ఆదివారం ఉదయం 7.30 నుండి లా మెర్ సౌత్ సమీపంలోని జుమేరా 1 పబ్లిక్ బీచ్‌లో జరుగుతాయన్నారు. వయస్సుతో నిమిత్తం లేదని, ఆసక్తి ఉన్నవారు సొంత గాగుల్స్, సౌకర్యవంతమైన స్విమ్‌సూట్, నీరు, సన్‌బ్లాక్, నేర్చుకోవాలనే పట్టుదల, బీచ్‌ను శుభ్రం చేయాలనే అభిరుచి ఉంటే చాలన్నారు. ఆసక్తి ఉన్నవారు తన వ్యాపార మొబైల్ నంబర్ +971 50 976 4948కి వాట్సాప్ సందేశాన్ని పంపడం ద్వారా ఉచిత స్విమ్మింగ్ పాఠాల కోసం సైన్ అప్ కావాలని తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







