టీజర్ కోసం ముస్తాబవుతోన్న ‘సలార్’.!

- July 01, 2023 , by Maagulf
టీజర్ కోసం ముస్తాబవుతోన్న ‘సలార్’.!

‘ఆది పురుష్’ సినిమాతో బాగా దెబ్బ తిన్నాడు ప్రబాస్. ఇక, ప్రబాస్ ఆశలన్నీ ‘సలార్’ పైనే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి టీజర్‌ని ముస్తాబు చేసే పనిలో చిత్ర యూనిట్ వున్నాడట.
‘ఆది పురుష్’ డిజాస్టర్‌తో ప్రబాస్.. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా చాలా డిజప్పాయింట్‌మెంట్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆ డిజప్పాయింట్‌మెంట్ నుంచి తేరుకోవడానికే ‘సలార్’ని రంగంలోకి దించుతున్నారట.
ప్రత్యేకంగా ఈ టీజర్‌ని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ‘ఆది పురుష్’ సినిమా కోసం పని చేస్తూనే, మరోవైపు ‘సలార్’ షూటింగ్‌లోనూ ప్రబాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ‘ఆదిపురుష్’ డ్యామేజ్ నుంచి తేరుకోవడానికే ఇప్పటికిప్పుడు అర్జెంటుగా టీజర్ రెడీ చేస్తున్నారట. అలాగే, ‘ప్రాజెక్ట్ కె’ గురించి కూడా అతి త్వరలోనే ఓ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ రానుందనీ తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com