యూఏఈ లో త్వరలో మరో 3-రోజుల వారాంతం..!
- July 03, 2023
యూఏఈ: యూఏఈలో ఇస్లామిక్ పండుగ ఈద్ అల్ అదా సందర్భంగా ఆరు రోజుల వారాంతాన్ని నివాసితులు పొందారు. నేటి నుంచి కార్యాలయాలు తిరిగా ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా.. హిజ్రీ న్యూ ఇయర్‌కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా మరో మూడు రోజుల వారాంతం నివాసితులకు రానుంది. ఎమిరేట్స్ ఆస్ట్రానమీ సొసైటీ (ESA) అధ్యక్షుడు ఇబ్రహీం అల్ జర్వాన్ ప్రకారం.. కొత్త హిజ్రీ సంవత్సరం (ముహర్రం 1) బుధవారం, జూలై 19 న వచ్చే అవకాశం ఉంది. అయితే, యూఏఈ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సెలవుల జాబితా ప్రకారం, శుక్రవారం, జూలై 21న ఉంటుంది. ఇది మూడు రోజుల వారాంతాన్ని తీసుకొస్తుంది. ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని 2023లో నాల్గవ, చివరి సుదీర్ఘ విరామం సెప్టెంబర్ 29, శుక్రవారం నాడు రానుంది. ఇది మరో లాంగ్ వీకెండ్ అవుతుంది. సంవత్సరం చివరి సెలవుదినం యూఏఈ జాతీయ దినోత్సవం డిసెంబర్ 2, 3 (శనివారం, ఆదివారం) రానుంది.
అల్ జర్వాన్ 2024 కోసం పవిత్ర రంజాన్, ఈద్ అల్ ఫితర్, ఈద్ అల్ అదా తేదీలను కూడా వెల్లడించింది. ఖగోళ శాస్త్ర గణనల ఆధారంగా.. వచ్చే ఏడాది పవిత్ర రంజాన్ మాసం మార్చి 11, సోమవారం ప్రారంభమవుతుంది. ఇది 30 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈద్ అల్ ఫితర్ ఏప్రిల్ 10 బుధవారం నాడు వస్తుంది. యూఏఈలోని ఉద్యోగులకు సాధారణంగా రంజాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు సెలవు ఉంటుంది.
2024లో ఈద్ అల్ అదా జూన్ 17, సోమవారం వచ్చే అవకాశం ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుని వీక్షణలపై ఆధారపడి ఉంటుంది. నెలవంక కనిపించడాన్ని బట్టి తేదీలు మారవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







