తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..
- July 04, 2023
హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం నుంచి గురువారం వరకు పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. సోమవారం నైరుతి ఆవర్తనం దాని పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంగళవారం (ఇవాళ) నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
బుధవారం రోజు అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ , రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.
గురువారం సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వానికి రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదించింది. ఖమ్మం జిల్లా, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జూన్ నెలలో సగటు వర్షపాతంతో పోల్చితే 60శాతం నుంచి 77శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత







