TANA మహాసభలు...సాహిత్య కార్యక్రమాలు
- July 04, 2023
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు. సాహిత్య కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. సాహితీ స్రవంతి పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమాలు జూలై 8వ తేదీన, జూలై 9వ తేదీన వైభవంగా జరగనున్నాయి.
శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 గంటల వరకు జరుగు కార్యక్రమానికి అధ్యక్షులుగా వాసిరెడ్డి నవీన్ వ్యవహరిస్తున్నారు. అమెరికాలో తెలుగు కథకులు అంశంపై తాడికొండ శివకుమార శర్మ, డయస్సోరా కథలు అంశంపై సాయి బ్రహ్మానంద్ గొర్తి, కవితాపఠనం అంశంపై వసీరా, తమ్మినేని యదుకుల భూషణ్ మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు మేడసాని మోహన్ అవధాన కార్యక్రమం ఉంటుంది.
జూలై 9వ తేదీ ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.00 వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిగురుమళ్ళ శ్రీనివాస్ అధ్యక్షత వహించనున్నారు. మనుస్మృతి మంచి చెడు అంశంపై ముత్తేవి రవీంద్రనాథ్, తెలుగు నాటకం అంశంపై దీర్ఘాశి విజయ్‌కుమార్, పద్యనాటకం అంశంపై మీగడ రామలింగస్వామి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 11.00 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు సంభాషణ పేరుతో ఓ కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా జంపాల చౌదరి వ్యవహరిస్తున్నారు. అతిధులుగా తానా గిడుగు రామమూర్తి స్మారక అవార్డు గ్రహీత మన్నెం వెంకట రాయుడు, తానా బహుమతిని గెలుచుకున్న రచయిత చింతకింది శ్రీనివాసరావు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు పాటల అంశంపై కార్యక్రమం జరగనున్నది. కొసరాజు సినిమా పాటలు అంశంపై విజయ చంద్రహాస్ మద్దూరి, జానపదం అంశంపై అందెశ్రీ, పేరడీలు అంశంపై జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 వరకు తెలుగు సాహిత్యంలో యువస్వరాలు అంశంపై కార్యక్రమం జరుగుతుంది. వాసిరెడ్డి నవీన్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో బీరం సుందరరావు కవిత్వం అంశంపై, కథలు అంశం పై మల్లిఖార్జున్, కవితపఠనం ఏనుగు నరసింహారెడ్డి, కళ్యాణ్ మాట్లాడనున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







