సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
- July 04, 2023
న్యూ ఢిల్లీ: పుట్టపర్తి సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ప్రధాని మోడి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ…పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు చెప్పారు. సత్యసాయి బాబా జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్లు ఇక్కడికి వచ్చి తమ అభిప్రాయాలు పంచుకుంటారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశ యువతకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ కేంద్రం ద్వారా దేశానికి ఎంతో మంది మేధావులను అందజేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.
సత్యసాయి బాబా సేవలు ప్రపంచానికి స్ఫూర్తి అని.. గుజరాత్ భూకంపం సమయం లో బాధితులకు అండగా సత్యసాయి బాబా నిలిచి సేవలు అందించారన్నారు. ఏపీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాగి జావ అందిస్తున్న సత్యసాయి ట్రస్టు కు అభినందనలు తెలిపారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు మానవాళికి ఎంతో అవసరం అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









