యూఏఈలో సమ్మర్ సేల్స్: డిస్కౌంట్లు, ప్రమోషన్లు
- July 05, 2023
యూఏఈ: దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్, షార్జా సమ్మర్ ప్రమోషన్ల మెగా షాపింగ్ అమ్మకాలతో వేసవి సీజన్ నివాసితులు, సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ విక్రయాలు నమ్మశక్యం కాని తగ్గింపులను అందిస్తున్నాయి. కస్టమర్లు ఈ సమయాల్లో తమ కొనుగోళ్లపై 75 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. హ్యాండ్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి తగ్గింపులు, విక్రయాలను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా కొత్త ఫర్నిచర్, గృహ ఉపకరణాల కోనుగోళ్లలో భారీ తగ్గింపులను పొందడంతోపాటు క్యాష్ బ్యాక్ ఆపర్లను దుకాణందారులు అందిస్తున్నారు. షార్జా సమ్మర్ ప్రమోషన్లు 2023, జూలై 1న ప్రారంభమై 65 రోజుల పాటు కొనసాగుతుంది. 75 శాతం వరకు మెగా తగ్గింపులు, Dh100,000 విలువైన వోచర్లతో పాటు హోటల్ ప్యాకేజీలు, టూరిస్ట్ ప్యాకేజీలు మరియు సరికొత్త నిస్సాన్ కోసం గ్రాండ్ డ్రాను అందిస్తుంది. ఇదేవిధంగా, జూన్ 29 నుండి సెప్టెంబర్ 3 వరకు కొనసాగనున్న దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్ (DSS) 26వ ఎడిషన్ షాపింగ్ డీల్స్, ప్రమోషన్లు మరియు ఫ్రీబీలతో తిరిగి వచ్చింది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







