భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్
- July 05, 2023
న్యూ ఢిల్లీ: భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ కు కీలక పదవి దక్కింది. భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ అతణ్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం ప్రకటించాడు. ”సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపెలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ సెలక్షన్ కమిటీలో ఖాళీ అయిన ఒక స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను ఎంపిక చేసింది. అనంతరం మిగతా సెలక్టర్లతో పోలిస్తే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం ఉన్న అతడినే సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదించింది” అని షా ఒక ప్రకటనలో తెలిపారు.
అజిత్ అగార్కర్ 1998 నుంచి 2007 వరకు 191 వన్డేలు, 26 టెస్టు మ్యాచ్ లు, నాలుగు టీ 20 మ్యాచ్ లు ఆడారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో అజిత్ అగార్కర్ ఉన్నారు. ఈయన లార్డ్స్ లో టెస్టు శతకం సాధించారు. రిటైర్మెంట్ తర్వాత అగార్కర్ చాలా ఏళ్ల నుంచి క్రికెట్ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







