తండ్రి బాటలోనే తనయ.! బ్రాండ్ అంబాసిడర్‌గా సితార.!
- July 05, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల్లోనే సూపర్ స్టార్ కాదు. కమర్షియల్ యాడ్స్‌లోనూ ఆయన సూపర్ స్టారే. సౌత్ నుంచి కమర్షియల్ యాడ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్ రికార్డులు సృష్టించారు. సృష్టిస్తూనే వున్నారు.
ఇక, ఇప్పుడు ఆయన ముద్దుల తనయ సితార లైన్లోకి వచ్చింది. చిన్నప్పటి నుంచీ సితార సోషల్ మీడియాలో పిచ్చ పాపులర్. పలు రకాల యాక్టివిటీస్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది సోషల్ మీడియాలో సితార.
ఇకపై సినిమాల్లోనూ రాణించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ జ్యూయలరీ షాప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతోంది.
పీఎమ్‌జే అను ప్రముఖ జ్యూయలరీ సంస్థ.. తమ ఆభరణాలను ప్రమోట్ చేసేందుకు సితారను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు తెలిపింది.
చూస్తుంటే, సితార భవిష్యత్తులో ఇలాంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా అలాగే కమర్షియల్ ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటూ, త్వరలోనే హీరోయిన్‌గానూ సినిమాల్లో తెరంగేట్రం చేయబోతోందనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









