గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.! జర జాగ్రత్త అవసరం సుమా.!
- July 05, 2023ఈ మధ్య గ్రీన్ టీకి భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్య రీత్యా గ్రీన్ టీ మంచి ఫలితాల్నిస్తుండడమే అందుకు కారణం. అధిక బరువును తగ్గించడంలోనూ డయాబెటిస్, అధిక రక్తపోటు తదితర అనారోగ్య సమస్యలను అదుపులో వుంచుతుండడంతో, ఈ టీ తాగేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
అయితే, విచ్చలవిడిగా గ్రీన్ టీ తాగడం వల్ల అనేక అనర్ధాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల అందులోని ఆయుర్వేద గుణాలు శరీరంలోని ఇతర అవయవాలపై చెడు ప్రభావం చూపించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
పరగడుపుతో మాత్రమే గ్రీన్ టీ తీసుకోవాలి. ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయ్. అంతేకాకుండా, ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని ఐరన్ లోపించే ప్రమాదముందట.
అలాగూ అతిగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదమున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో ఒక్కసారి.. లేదంటే రెండు సార్లు (విత్ గ్యాప్) మాత్రమే గ్రీన్ టీ ఆరోగ్యం. అతి సర్వత్రా వర్జయేత్. ఆరోగ్యానికి మంచిది కదా.. అని అతిగా తీసుకుంటే అంతే సంగతి. ప్రమాదం తప్పదు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు