పర్యాటక ప్రాంతాంగా షార్జా 'బరీడ్ విలేజ్'

- July 06, 2023 , by Maagulf
పర్యాటక ప్రాంతాంగా షార్జా \'బరీడ్ విలేజ్\'

యూఏఈ: ఎడారిలో దాదాపు సగం వరకు కప్పబడిన షార్జా విలేజ్ ‘బరీడ్ విలేజ్’ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి, అల్ మేడమ్‌లోని పురాణ 'బరీడ్ విలేజ్'ని సంరక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులు, పర్యాటకుల కోసం ఘురైఫా గ్రామాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అల్ మేడమ్‌కు నైరుతి దిశలో 2కిమీ దూరంలో ఉన్న ఈ పాడుబడిన గ్రామంలో రెండు వరుసల ఒకే రకమైన ఇళ్లు, రోడ్డు చివర ఒక మసీదు ఉన్నాయి. ఇది 'బరీడ్ విలేజ్' పేరు పొందింది.  ఇక్కడున్న వారికి ప్రభుత్వం కొత్త ఇళ్లను అందించడంతో 1999లో ఇక్కడి నివాసితులు దానిని విడిచిపెట్టారు.  అనంతరం కాలంలో   ఇసుక పరిమాణం పెరగడంతో గ్రామం మొత్తం ఇసుకతో కప్పబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com