పిల్లలు, మహిళల భద్రతకి పెద్ద పీట: సిపీ డి.ఎస్ చౌహాన్
- July 06, 2023
హైదరాబాద్: నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఘట్కేసర్ లో కిడ్నాప్ కి గురైన నాలుగేళ్ల చిన్నారి కృష్ణవేణిని రాచకొండ పోలీసులు క్షేమంగా పాప తల్లిదండ్రులకు అప్పగించారు. పాపను రాచకొండ కమిషనర్ డి.ఎస్ చౌహాన్ స్వయంగా ఎత్తుకునివచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.
బాధిత చిన్నారి ఇంటి దగ్గరలో నివసించే వ్యక్తి సురేష్, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో చాక్లెట్ కోసం బయటికి వచ్చిన పాపను అపహరించడం జరిగింది. ఫిర్యాదు అందుకున్న ఘట్కేసర్ పోలీసులు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని రక్షించి క్షేమంగా తల్లి దండ్రుల చెంతకు చేర్చారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పాప కిడ్నాప్ కు గురైన ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడం జరిగిందని, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పరిసరాల్లోని అన్ని సిసిటివి కెమెరాలను పరిశీలించి పాపను అపహరించిన సురేష్ కదలికలను గమనించామన్నారు. బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సురేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకున్నామని, పాపతో పాటు నిందితుడిని స్టేషన్‌కు తరలించిన అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందించి సురక్షితంగా వారికి అప్పగించామని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని తెలిపారు.
ఘట్కేసర్ గ్రామంలో ఉన్న యువకులంతా కూడా చిన్నారిని కాపాడేందుకు వెతకడం లో పాల్గొన్నారని, వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి నేరం జరిగినా 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని, నేరాలను అదుపుచేసే సంకల్పంతో పని చేస్తున్నామని కమిషనర్ పేర్కొన్నారు. ఆడపిల్లలకు, మహిళల భద్రతకి పెద్ద పీట వేస్తున్నామని, మహిళ భద్రతకు సంబంధించి ఏ కేసు ఉన్న సీరియస్ గా తీసుకుంటున్నామని తెలిపారు.
గంటల వ్యవధిలోనే తమ బిడ్డను తమ వద్దకు చేర్చినందుకు బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పాపను సురక్షితంగా తల్లి దండ్రుల చెంతకు చేర్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ జిందాబాద్ అంటూ స్థానికుల నినాదాలు చేయడం గమనార్హం. చిన్నారిని రక్షించిన ఘట్కేసర్ పోలీసులను కమిషనర్ అభినందించారు.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్‌లైన్‌గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







