భారత్ కు మద్దతు తెలిపిన అమెరికా
- May 14, 2016
చైనాను తోసిరాజని.. భారతదేశానికి అమెరికా అండగా నిలిచింది. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ వద్దని ఎంత మొత్తుకుంటున్నా.. భారతదేశం మాత్రం అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో చేరడం ఖాయమని అమెరికా బల్లగుద్ది చెబుతోంది. ఎన్ఎస్జీలో భారత్ చేరడాన్ని చైనా వ్యతిరేకించిన కొద్ది గంటల్లోనే భారతదేశానికి మద్దతుగా అమెరికా ముందుకొచ్చింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2015లోనే చెప్పిన విషయాన్ని అమెరికా హోంశాఖ ప్రతినిధి జాన్ కిర్బీ గుర్తుచేశారు. మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ నిబంధనలను భారతదేశం పాటిస్తోందని, అందువల్ల అణు సరఫరాదారుల బృందంలో చేరడానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని కిర్బీ అన్నారు. చైనా, పాకిస్థాన్ మాత్రం భారత సభ్యత్వం విషయంలో ముందునుంచే వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంతో తమకున్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా పాకిస్థాన్‌ను వాడుకోవడం చైనాకు తగదని కూడా అమెరికా భావిస్తున్నట్లు ఇటీవల అమెరికా మీడియా తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







