తగ్గిన వందేభారత్ టికెట్ ధరలు
- July 08, 2023
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..వందేభారత్ టికెట్ ధరలు తగ్గాయి. కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ట్రైన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే దేశ వ్యాప్తంగా ఈ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. అయితే సామాన్య ప్రజలు మాత్రం వీటిల్లో ప్రయాణించడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం టికెట్ ధరలే. సాధారణ ట్రైన్ టికెట్ ధర కన్నా ఈ వందేభారత్ ట్రైన్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం తో చాలామంది కాస్త ఆలస్యమైనా సాధారణ ట్రైన్స్ లలో ప్రయాణించడానికే మొగ్గు చూపిస్తున్నారు.
దీనిని గమనించిన రైల్వే వందేభారత్ టికెట్ ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. వందేభారత్‌తో పాటు అన్ని AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే…ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్‌కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్‌పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్‌లు, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జ్, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







