దుబాయ్ లో ఘనంగా వై.ఎస్ రాజశేఖర రెడ్డి 74 వ జయంతి వేడుకలు
- July 09, 2023
దుబాయ్: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలు యూఏఈ దేశంలోని దుబాయ్ నగరంలోని అల్ కరమా జబీల్ పార్కు నందు వైకాపా యూఏఈ కన్వీనర్ సయ్యద్ ఆక్రం బాషా మరియు జి.సి.సి యూఏఈ అడ్వైజర్ ప్రసన్న సోమిరెడ్డి, యూఏఈ వైఎస్సార్ వింగ్స్ గ్రూపు సభ్యలు, యూఏఈ ఏపీఎన్ఆర్టీఎస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సయ్యద్ అక్రం బాషా, ప్రసన్న సోమి రెడ్డి తదితరుల చేతుల మీదుగా దివంగత నేత చిత్ర పటానికి పూలమాల వేసి, భారీ కేక్ కట్ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి శ్రద్ధాంజలి ఘంటించారు.
ఈ సందర్భంగా అక్రం మాట్లాడుతూ అపర భగీరథుడు ఆరోగ్యశ్రీ ప్రదాత రాజన్న పరిపాలన లో పేద బడుగు బాలహీన వర్గాల, ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, పేద రైతులకు రుణ మాఫీ పధకం పేద విద్యార్ధుల చదువు కొరకు ఫీజు రీయింబర్స్మెంట్ పధకం ముస్లిమ్ మైనారిటీలకు విద్య ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు కల్పించి ముస్లిం మైనారిటీల జీవితాలలో వెలుగు నింపిన మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వర్గీయ YSR ని తెలిపారు.
సోమిరెడ్ఢి మాట్లాడుతూ జలయజ్ఞం, ఉచిత విధ్యుత్ పధకం, అమలు చేసిన ఘనత వారే దక్కిందని, రాజన్న భౌతికంగా మన మధ్య లేక పోయిన తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచి పోయారని ఆయన తెలిపారు. రాజన్న కోరుకున్న గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన, ఆంధ్రరాష్ట్రంలో YSR తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తరపట్ల మోహన్,శ్యాంరెడ్డి, బ్రహ్మనంద రెడ్డి, నాసిర్, కోటేశ్వరెడ్డి, కాగిత కుమార్, కొల్లే రవి, ఓగూరి శ్రీను, ప్రేమ కుమార్, వై.ఎస్. ఆర్ శ్రీను,గోసంగి లక్ష్మి, మారుమూడి సుధా, ఎలిజిబెత్, పార్వతి,వైఎస్ఆర్సిపీ యూఏఈ కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, ఏపిఎన్ఆర్టీఎస్ సభ్యులు, మహిళ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









