గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వ్యక్తిపై దాడి.. యువకుడికి ఏడాది జైలుశిక్ష

- July 10, 2023 , by Maagulf
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన వ్యక్తిపై దాడి.. యువకుడికి ఏడాది జైలుశిక్ష

బహ్రెయిన్: తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసినందుకు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడి శిక్షను అప్పీల్ కోర్టు తగ్గించింది. హింసాత్మకంగా దాడి చేసి బాధితుడి ముక్కు పగలగొట్టినందుకు మూడు సంవత్సరాలు పడ్డ శిక్షను కోర్టు ఏడాదికి తగ్గించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. బహ్రెయిన్ నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ తన స్నేహితురాలితో బాధితుడు కలిసి డ్యాన్స్ చేయడం చూసిన నిందితుడు కోపంతో ఊగిపోయాడు. నియంత్రించుకోలేని కోపంతో అతడిపై దాడికి పాల్పడ్డాడు.  వైద్య నిపుణుల రిపోర్టులు, ప్రత్యక్ష సాక్షుల కథనాలు, కేసు పూర్వాపరాలను పరిశీలించిన అప్పీల్ కోర్టు మూడేళ్ల శిక్షను ఏడాదికి తగ్తిస్తూ తీర్పు వెలువరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com