రియాద్ ఎయిర్ లో 700 మంది పైలట్‌ల నియామకం

- July 11, 2023 , by Maagulf
రియాద్ ఎయిర్ లో 700 మంది పైలట్‌ల నియామకం

సౌదీ: సౌదీ అరేబియా కొత్త విమానయాన సంస్థ రియాద్ ఎయిర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. 2025లో టేకాఫ్ చేయడానికి సన్నద్ధమవుతున్నందున పైలట్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. బోయింగ్‌ విమానాలను నడపడంలో శిక్షణ పొందిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని  రియాద్ ఎయిర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పీటర్ బెల్లూ తెలిపారు.

కింగ్‌డమ్ సావరిన్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) ద్వారా ప్రారంభించబడిన ఎయిర్‌లైన్, ఏప్రిల్ 2023లో బహుళ-బిలియన్ డాలర్ల ఒప్పందంలో 72 బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలను ఆర్డర్ చేసింది. మొత్తంగా 330 మిలియన్ల ప్రయాణీకులకు సేవలందించడం, 2030 నాటికి 100 మిలియన్ల సందర్శనలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా బోయింగ్ చరిత్రలో ఐదవ-అతిపెద్ద ఒప్పందం చేసుకుంది.  ఇంటర్వ్యూ ప్రక్రియ సెప్టెంబరు 2023లో ప్రారంభమవుతుందని, జనవరి 2024లో వ్యక్తులను అధికారికంగా చేర్చడాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభిస్తుందని బెల్లెవ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com