ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో
- May 14, 2016
ఎనర్జిటిక్ స్టార్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో వచ్చిన 'కందిరీగ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో 'నమో వెంకటేశ', 'దూకుడు', '1 నేనొక్కడినే', 'లెజెండ్', 'పవర్'(కన్నడం), 'ఆగడు', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.8గా రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఓ భారీ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పుట్టినరోజు మే 15. ఈ సందర్భంగా రామ్‌కు నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్ర విశేషాలను తెలిపారు.నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ - "జూన్ 3 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తున్నాం. నాన్ స్టాప్‌గా షూటింగ్ చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 30న గానీ, అక్టోబర్ 7న గానీ వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం. కందిరీగ తర్వాత రామ్, సంతోష్ శ్రీన్‌వాస్ కాంబినేషన్‌లో ఇది మరో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతోంది. అలాగే మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది" అన్నారు
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







