ప్రపంచంలో అత్యధిక కేలరీలు వినియోగించే దేశంగా బహ్రెయిన్
- July 11, 2023
బహ్రెయిన్: ప్రపంచంలో అత్యధిక కేలరీలు వినియోగించే దేశంగా బహ్రెయిన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో అత్యధిక కేలరీలు వినియోగించే దేశాల జాబితాలో బహ్రెయిన్ అగ్రస్థానంలో ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం సమాచార వేదిక OurWorldInData ద్వారా విడుదల చేయబడిన గణాంకాలు ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ఆధారంగా రూపొందించబడ్డాయి. బహ్రెయిన్ జనాభా ప్రతి వ్యక్తికి రోజుకు 4012 కేలరీలతో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో 3868 కేలరీలతో యునైటెడ్ స్టేట్స్, 3850 కేలరీలతో ఐర్లాండ్, బెల్జియం (3824 కేలరీలు), టర్కీ (3762 కేలరీలు), ఆస్ట్రియా (3738 కేలరీలు), జర్మనీ (3647 కేలరీలు), ఇటలీ (3620 కేలరీలు), ఖతార్ ( 3609 కేలరీలు), మరియు రొమేనియా (3599 కేలరీలు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
11 నుండి 20 వరకు స్థానాల వరకు వరుసగా ఫ్రాన్స్ (3581 కేలరీలు), ఇజ్రాయెల్ (3570 కేలరీలు), కెనడా (3,569 కేలరీలు), పోలాండ్ (3538 కేలరీలు), అల్జీరియా (3519 కేలరీలు), లక్సెంబర్గ్ (3497 కేలరీలు), పోర్చుగల్ (3489 కేలరీలు), నార్వే (3472 కేలరీలు), మాంటెనెగ్రో (3468 కేలరీలు), హాలండ్ (3460 కేలరీలు) ఉన్నాయి.
ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం పెరగాక ప్రపంచవ్యాప్తంగా కేలరీల వినియోగం పెరుగుతోందని అధ్యయనం వివరించింది. 1970వ దశకంలో 175 మిలియన్ల మందితో పోలిస్తే ఇప్పుడు ఒక బిలియన్ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారని, అటువంటి ఆహారాలను అధికంగా తీసుకోవడం ఊబకాయానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అల్జీమర్స్ వ్యాధితో సహా సంబంధిత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నివేదికలో పేర్కొన్నారు.
అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ప్రజలు రోజుకు సగటున 2,000 కేలరీలు మాత్రమే తినాలి. అదే విధంగా యూకే పబ్లిక్ హెల్త్ సర్వీస్ ప్రకారం.. మహిళలు రోజుకు దాదాపు 2,000 కేలరీలు తీసుకోవాలి, అదే సమయంలో పురుషులు 2,500 కేలరీల వరకు తీసుకోవచ్చు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







