పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- July 11, 2023
యూఏఈ: ఉమ్ అల్ క్వైన్‌లోని ఓ పెర్ఫ్యూమ్ ప్లాంట్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు ఎమిరేట్స్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ బలగాలు మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ విభాగాలకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఉమ్ అల్ క్వైన్ సివిల్ డిఫెన్స్ బృందంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉమ్ అల్ ఖువైన్ క్రౌన్ ప్రిన్స్ షేక్ రషీద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా మాట్లాడుతూ.. రస్ అల్ ఖైమా, అజ్మాన్ మరియు షార్జాలోని పౌర రక్షణ శాఖల వేగవంతమైన ప్రతిస్పందనను ప్రశంసించారు. మానవ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపులోకి తెచ్చారని కొనయాడారు. ఉమ్ అల్ ఖైవైన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సౌద్ బిన్ రషీద్ అల్ ముఅల్లా, డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ సలేం హమద్ బిన్ హమ్దాతో కలిసి ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించారు. ఉమ్ అల్ ఖైవైన్లోని సివిల్ డిఫెన్స్ మరియు అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ ఖలీద్ అల్ షమ్సీ కూడా వారితో ఉన్నారు.
తాజా వార్తలు
- Dubai ESC Confirms Readiness for Global Village's 31st Season
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







