రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మలేషియా పర్యటన
- July 11, 2023
మలేషియా: మలేషియా లో ని భారత హై కమీషనర్ బి.న్ రెడ్డి, గౌరవనీయులైన భారత ప్రభుత్వ రక్షణా శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారి గౌరవార్ధం మలేషియా లో నివసిస్తున్న భారత సంతతి కోసం ఈరోజు మాన్హట్టన్, బెర్జయ టైమ్స్ స్క్వేర్ హోటల్, కౌలాలంపూర్,మలేషియా లో విందును ఏర్పాటు చేశారు.
రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మలేషియా లో రెండు రోజుల అధికార పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం మరియు అభివృద్ధి చెందిన వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి సారించడానికి మలేషియా రక్షణ శాఖ మంత్రి దాతో మొహమ్మద్ హాసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇందులో భాగంగా మలేషియా ప్రధాని దాతో అన్వార్ ఇబ్రహీంని కూడా కలిశారు. ఈ సమయంలో మంత్రులిద్దరూ రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి కొత్త కార్యక్రమాల పై ఇరుపక్షాలు చర్చించారు.
భారతదేశం మరియు మలేషియా రెండు దేశాలు శాంతి మరియు శ్రేయస్సు పై ఆసక్తి కలిగి ఉన్నాయి అని . రెండు ప్రజాస్వామ్యం దేశాలు బలమైన మరియు బహుముఖ సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని ఈ సందర్భంగా గుర్తు చేసారు ఇరు పక్షాల రక్షణ మరియు భద్రతతో సహా అనేక వ్యూహాత్మక భాగస్వామ్య దృక్పథం ప్రకారం పని చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్,తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్,ఆంధ్ర అసోసియేషన్, తమిళ్ అసోసియేషన్, సంత్ నిరంకారీ మిషన్, NRTIA మలేషియా , మలేషియా ఒడియా అసోసియేషన్ ,PIO మలేషియా మరియు ఇతర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు .
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







