ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్‌లు
- July 11, 2023
కువైట్: ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన స్కామింగ్ మెసేజ్‌ల సమస్య ఇటీవల బాగా పెరిగింది. దీంతో కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. పంపిన లింక్ ద్వారా ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని ప్రజలను కోరుతూ స్కామర్లు పంపిన SMS సందేశాలు పంపుతున్నారని, వాటి పట్ల జాగ్రత్తగా వ్యవహారించాలని హెచ్చరించింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు చెల్లించకుంటే పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని బెదిరించే సందేశాలు తాము పంపమని గమనించాలని కోరింది. ఇవి ప్రజలను మోసం చేయడానికి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను క్లోనింగ్ చేసే వెబ్‌సైట్‌ను ఉపయోగించే స్కామింగ్ కార్యకలాపాలు, మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇది ప్రభుత్వ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, సహెల్ అప్లికేషన్లో ఉల్లంఘించిన వారికి మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనల హెచ్చరిక సందేశాలను పంపుతుందని పేర్కొంది. ఏదైనా చెల్లింపు ఆపరేషన్‌కు ముందు వారు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ను ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







