అమెరికా టూర్.. కన్ఫ్యూజన్లో కిషన్ రెడ్డి
- July 11, 2023
అమెరికా టూర్ పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కన్ ఫ్యూజన్ లో పడిపోయారు. రేపు (జులై 12) తెల్లవారుజామున కిషన్ రెడ్డి అమెరికా వెళ్లాల్సి ఉంది. ఈ నెల 13న యూఎన్ఓలో ప్రపంచ టూరిజంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో 15 నిమిషాలు ప్రసంగించాల్సి ఉంది. ఇప్పటికే అమెరికా వెళ్లేందుకు వీసా ప్రాసెస్ తో పాటు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు కిషన్ రెడ్డి.
అయితే, కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారంతో కిషన్ రెడ్డి టూర్ పై క్లారిటీ రావడం లేదు. ఇప్పటివరకు ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని ఆయన సిబ్బంది అంటోంది.
కాగా, రేపు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేపటి క్యాబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు రేపు రాత్రికి ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేపు లేదా 18 తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక









