యూఏఈ-ఇండియా ప్రయాణం: NRIలు, పర్యాటకులు ఎంత నగదును తమ దేశానికి తీసుకువెళ్లవచ్చు?
- July 12, 2023
యూఏఈ: యూఏఈ దాదాపు 3.7 మిలియన్ల భారతీయ పౌరులకు నిలయంగా ఉంది. అయితే, దక్షిణాసియా దేశం నుండి మిలియన్ల మంది పర్యాటకులు, వ్యాపారవేత్తలు ప్రతి సంవత్సరం ఎమిరేట్స్‌ను సందర్శిస్తారు. ఈ సమయంలో కొందరు లక్షలాది దిర్హామ్, భారతీయ కరెన్సీని నగదుగా తీసుకువెళ్లడం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి బ్యాగ్‌లో 1.42 మిలియన్ దిర్హామ్‌లు (నగదు) కనుగొన్న తర్వాత ముంబై విమానాశ్రయంలో దుబాయ్‌కు వెళుతున్న వ్యక్తిని అరెస్టు చేసింది.
యూఏఈ సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. యూఏఈకి వచ్చే, ఇతర దేశాలకు ప్రయాణించే ప్రయాణికులు ప్రతి సందర్శనకు $3,000 (Dh11,000) వరకు మాత్రమే విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడానికి అనుమతిస్తారు. రెగ్యులేటర్ NRIలు స్టోర్ వాల్యూ కార్డ్‌లు, ట్రావెలర్స్ చెక్‌లు లేదా బ్యాంకర్ డ్రాఫ్ట్‌ల రూపంలో ఎక్కువ మొత్తాలను తీసుకువెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఇరాక్, లిబియాకు వెళ్లే ప్రయాణికులు ప్రతి సందర్శనకు $5,000 లేదా దానికి సమానమైన విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకెళ్లవచ్చు. అపెక్స్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ప్రకటన ప్రకారం.. ఇరాన్, రష్యా, కామన్వెల్త్ స్వతంత్ర రాష్ట్రాలకు వెళ్లే వ్యక్తులు విదేశీ కరెన్సీ నోట్లు లేదా నాణేల రూపంలో $250,000 వరకు విదేశీ మారకాన్ని డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో హజ్ మరియు ఉమ్రా కోసం వెళ్లే భారతీయ పౌరులు కూడా $250,000 నగదును తీసుకెళ్లవచ్చు.
ఇండియాకి ప్రయాణించే సమయంలో..
ఆర్బీఐ ప్రకారం.. భారతదేశ నివాసి, పర్యటన కోసం దేశం నుండి బయటకు వెళ్లిన వారు, భారతీయ కరెన్సీ నోట్లను రూ.25,000 మించకుండా తీసుకురావచ్చు. అయితే, నేపాల్ లేదా భూటాన్ నుండి ప్రజలు 100 రూపాయలకు మించకుండా రూపాయి నోట్లను తీసుకురావచ్చు. ఇదిలా ఉండగా విదేశాల నుంచి భారత్‌కు వచ్చే వ్యక్తి విదేశీ మారక ద్రవ్యాన్ని పరిమితి లేకుండా తీసుకురావచ్చు. అయితే, కరెన్సీ నోట్లు, బ్యాంకు నోట్లు లేదా ప్రయాణికుల చెక్కుల రూపంలో విదేశీ మారకపు మొత్తం విలువ $10,000 మించి ఉంటే లేదా విదేశీ కరెన్సీ విలువ మాత్రమే $5,000 లేదా దానికి సమానంగా ఉన్న పక్షంలో భారతదేశానికి చేరుకున్నప్పుడు కరెన్సీ డిక్లరేషన్ ఫారమ్ (CDF)లో విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులకు ప్రకటించాల్సి ఉంటుందని RBI రూల్స్ స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









